సిక్స్ ప్యాక్ కోసం ఆదిరెడ్డి కష్టాలు...మనకెందుకన్నా ఇలాంటి సాహసాలు..
on Feb 5, 2025
యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి ఇప్పుడు బుల్లితెర స్టార్ ఐపోయాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదాతో టీవీ షోస్ కి వస్తున్నాడు. అలాగే తన భార్య కవితను కూడా షోస్ కి తీసుకొస్తున్నాడు. అలాగే విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇష్మార్ట్ జోడి 3 కి తన భార్యతో కలిసి వచ్చాడు. ఇలా ఆదిరెడ్డి షోస్ అన్నిట్లో పాల్గొంటూ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రీసెంట్ ఒక డంబెల్ తో వర్కౌట్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసాడు. ఐతే పాపం సిక్స్ ప్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడు.
దాని గురించే ఆ పోస్ట్. "కనీసం ఈసారైనా ఆపకుండా చేయాలని కోరుకుంటున్నా.. ఇక్కడ పోస్ట్ చేయడానికి కారణం పోస్ట్ చేసా కాబట్టీ అయినా ఆపకుండా చేస్తా అని నా లైఫ్ లో అనుకున్నవి అన్నీ చేయాలిగా కానీ.. ఈ ఒక్క బాడీ మ్యాటర్ లో ఫెయిల్ అవుతూనే ఉన్నా.. ప్రతి సంవత్సరం స్టార్ చేయటం స్టాప్ చేయటం.. నా శరీరంలో బలహీనమైన భాగం నా చేతులు చిన్నపాటి నుంచీ చాలా ఇన్ఫెరియారిటీ కాంప్లెక్స్ ఉండేది నాకు. ఆ ఫోబియా పోవాలని కూడా ఈ పోస్ట్ పెడుతున్నా..2018లో 50 కిలోలు బరువుతో 6.3 ఎత్తు ఉండేవాణ్ణి.. అలా అక్కడ నుండి ఇప్పుడు 88 కిలోలకు వచ్చా.. ఏదో ట్రై చేస్తున్నా చూద్దాం... కానీ ప్రతీరోజూ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను" అని చెప్పాడు ఆదిరెడ్డి. ఇక నెటిజన్స్ ఐతే "ఆల్ ది బెస్ట్ ఆది... మొదటి రోజే మాకు ఈ సిక్స్ ప్యాక్ చూపించెయ్యాలా?? ఎయిట్ ప్యాక్ కోసం వెయిటింగ్...ఇంట్లో కుదరదు..జిమ్ కి వెళ్ళండి...ఫిట్ నెస్ మీద ఫోకస్ చేయడం బాగుంది..ఫిజికల్ గా మెంటల్ గా ఇవన్నీ అయ్యే పనులా కనిపించడం లేదు...మనకెందుకన్నా ఇలాంటి సాహసాలు.." అంటూ కొందరు పాజిటివ్ గా కొందరు నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
